RAJINI: విడదల రజని అనుచరులపై లంచం ఆరోపణలు

ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 5 కోట్లు వసూలు చేశారని బాధితుల ఆరోపణ

Update: 2025-11-04 05:00 GMT

పల్నా­డు జి­ల్లా­లో ఉద్యో­గాల పే­రిట భారీ మోసం బయ­ట­ప­డిం­ది. మాజీ మం­త్రి, వై­ఎ­స్ఆ­ర్ కాం­గ్రె­స్  నేత వి­డ­దల రజని పీ­ఏ­లు, అను­చ­రు­ల­పై దో­ర్నా­ల­కు చెం­దిన బీ.ఫా­ర్మ­సీ వి­ద్యా­ర్థి కృ­ష్ణ ,  మరి­కొం­త­మం­ది బా­ధి­తు­లు పల్నా­డు పో­లీ­స్ సూ­ప­రిం­టెం­డెం­ట్ కి ఫి­ర్యా­దు చే­శా­రు. ఉద్యో­గా­లు ఇస్తా­మ­ని వి­డ­దల రజని పీ­ఏ­లు శ్రీ­కాం­త్ రె­డ్డి, దొ­డ్డా రా­మ­కృ­ష్ణ ,  ఆమె ము­ఖ్య అను­చ­రు­లు శ్రీ­గ­ణే­శ్, అతని సో­ద­రు­డు కు­మా­ర­స్వా­మి మొ­త్తం రూ.5 కో­ట్లు వసూ­లు చే­శా­ర­ని ఆరో­ప­ణ­లు చే­శా­రు. డబ్బు తి­రి­గి ఇవ్వ­మ­ని కో­రి­తే బె­ది­రి­స్తు­న్నా­ర­ని  ఆరో­పిం­చా­రు. పల్నా­డు జి­ల్లా దో­ర్నాల మం­డ­లా­ని­కి చెం­దిన బీ.ఫా­ర్మ­సీ వి­ద్యా­ర్థి కృ­ష్ణ మరి­యు మరి­కొం­త­మం­ది యు­వ­కు­లు ఈ ఫి­ర్యా­దు  చే­శా­రు. వారి ప్ర­కా­రం, వి­డ­దల రజని అను­చ­రు­లు 2023-2024 మధ్య కా­లం­లో "ఉద్యో­గా­లు ఇస్తా­మ­ని" హామీ ఇచ్చి, వి­విధ రం­గా­ల్లో ఉద్యో­గా­లు ఇప్పిం­చేం­దు­కు మొ­త్తం రూ.5 కో­ట్లు వసూ­లు చే­శా­రు. ఈ మొ­త్తా­న్ని "ఉద్యో­గాల సి­ఫా­ర్సు ఫీజు"గా చె­ప్పు­కు­ని సే­క­రిం­చా­ర­ని ఫి­ర్యా­దు­లో పే­ర్కొ­న్నా­రు. అప్ప­ట్లో వి­డ­దల రజనీ మం­త్రి­గా ఉన్నా­రు. వి­డ­దల రజనీ పీ­ఏ­లు శ్రీ­కాం­త్ రె­డ్డి, రా­మ­కృ­ష్ణ­ వి­డ­దల రజని పే­రు­ను ఉప­యో­గిం­చు­కు­ని మోసం చే­శా­ర­ని వా­రం­టు­న్నా­రు.  శ్రీ­గ­ణే­శ్ ,  కు­మా­ర­స్వా­మి  డబ్బు­ సే­క­ర­ణ­లో కీలక పా­త్ర పో­షిం­చా­రు.

వైఎస్సార్సీపీ ఓడిపోగానే మోసగాళ్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేశారంటూ బాధితులు ఆందోళన చెందారు. బత్తుల శ్రీగణేష్ తమ్ముడిని గట్టిగా అడిగితే మమ్మల్ని చంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై పల్నాడు జిల్లా ఎస్పీకి వినతిపత్రం ద్వారా ఫిర్యాదు చేసినట్లు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.బాధితులు మొత్తం సుమారు 10 నుంచి 15 మంది వరకూ ఉన్నారని ఫిర్యాదు చేసిన విద్యార్థులు వివరించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. తమకు తక్షణమే న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

Tags:    

Similar News