East Godavari: 13 గంటల్లో 140 కిలోమీటర్లు.. పరుగు పందెంలో ఏపీ కుర్రాడి రికార్డ్..
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో రమేష్ అనే పరుగుల వీరుడు అరుధైన ఫీట్ సాధించాడు.;
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో రమేష్ అనే పరుగుల వీరుడు అరుధైన ఫీట్ సాధించాడు. 13గంటల్లోనే ఏకంగా 140కిలోమీటర్లు పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించాడు. అనుకున్న టైంకంటే గంటముందే గమ్యాన్ని చేరుకోవడం విశేషం. అనపర్తిలోని GBR కాలేజీ దగ్గర నిన్నరాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమైన పరుగు తిరిగి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మళ్లీ అదే స్పాట్‌కు చేరుకున్నాడు.
అనపర్తికి చెందిన రమేష్ కొన్నేళ్లుగా పరుగు పందెంలో రాణిస్తున్నాడు. 160కిలోమీటర్ల జాతీయ రికార్డుపై దృష్టిసారించిన రమేష్.. గతంలో 10గంటల్లోనే 100కిలోమీటర్లు పరుగెత్తి అరుధైన ఫీట్ సాధించాడు. ఇక తాజాగా 13గంటల్లోనే 140కిలోమీటర్లు పరుగెత్తి కొత్త రికార్డు సృష్టించాడు. ఇక స్వగ్రామం అనపర్తిలో రమేష్‌కు ఘనస్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి రమేష్‌ను అభినందించారు.