Palnadu : రంగా విగ్రహం ధ్వంసం.. పల్నాడులో ఉద్రిక్తత

Update: 2024-10-29 13:45 GMT

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వేమవరంలో మోహన రంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా పలనాడు జిల్లాలో అనేక హింసాత్మక ఘటన చోటు చేసుకున్నాయి. ఆ మంటలు ఆరక ముందే తాజాగా ఘటన పెను దుమారం రేపుతోంది. ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు కొందరు మోహన రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రంగా అభిమానులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News