ఏపీలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. కాని, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.;
ఏపీలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలతో పరీక్షలను రద్దు చేసే ఆలోచనేం లేదని స్పష్టంగా చెప్పింది ఏపీ ప్రభుత్వం. యథావిధిగా ఎగ్జామ్స్ పెట్టేందుకే మొగ్గు చూపింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేయాలని సూచించాయి.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. కాని, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. వచ్చే మూడు నాలుగు వారాల పాటు కరోనా పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతాయని చెబుతున్నారు.
కఠిన చర్యలు తీసుకోకపోతే.. పరిస్థితులు చేయి దాటొచ్చని హెచ్చరిస్తున్నారు. కాని, ఏపీ ప్రభుత్వం అలాంటి చర్యలేం తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.