దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డిపై చేసిన ఆరోపణలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ‘మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి’ అంటూ శాంతికి దేవదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ‘ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో సుభాష్‌ని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇది ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం’ అని నోటీసుల్లో పేర్కొంది.
దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె. మదన్‌మోహన్ అని సర్వీస్ రిజిస్టర్‌లో ఆమె నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు.