Lady Dons Under YSRCP : రెచ్చిపోతున్న వైసీపీ లేడీ డాన్లు..!

Update: 2025-12-27 13:15 GMT

ఏపీలో వైసీపీ హయాంలో ఎంతటి అరాచక శక్తులను పెంచి పోషించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఆకు రౌడీలే కాదు.. లేడీ డాన్లను కూడా ప్రోత్సహించింది వైసీపీ పార్టీ. అంతకు ముందు చంద్రబాబు హయాంలో వీరు లేరు. కానీ వైసీపీ హయాంలో రెచ్చిపోయి వాళ్ల సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. అమాయకుల భూములను కబ్జా చేశారు. సెటిల్మెంట్లు, దందాలతో రెచ్చిపోయి కోట్లు సంపాదించారు. గలీజు దందాలు చేస్తూ ప్రైవేట్ సైన్యాన్ని పెంచుకున్నారు. అడ్డు వస్తే మర్డర్లు కూడా చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ల బాగోతాలు బయటకు వస్తున్నాయి. లేడీ డాన్ అరుణ కేసు రాష్ట్రంలో ఎంత సంచలనం రేపిందో మనం చూశాం.

ఆమె బాటలోనే కామాక్షి అనే మరో లేడీ డాన్ కూడా ఇలాగే రెచ్చిపోయింది. విజయవాడను కేంద్రంగా చేసుకుని ఆమె చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను మర్డర్ చేయించింది కూడా ఈ కామాక్షి బ్యాచ్. ఇప్పుడు మరో లేడీ డాన్ గాదె రేణుక ఇలాగే రెచ్చిపోతోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ముసుగులో గంజాయిని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తోంది. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ అందరినీ నమ్మించింది. కానీ ఆమె దాని వెనకాల చేస్తున్నది గంజాయి వ్యాపారం. మొన్న పోలీసులకు దొరకడంతో ఆమె వ్యవహారం మొత్తం బయటకు వస్తోంది.

అంతకు ముందు కూడా ఆమె ఎన్నో అరాచకాలు చేసింది. కానీ అవేమీ పెద్దగా బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ లేడీ డాన్లు ఏపీని పట్టి పీడించాలని చూస్తున్నారు. ఇందుకోసం వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారుల అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. వైసీపీ సపోర్టు వీళ్లకు బాగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిని ఉపేక్షించదు కదా. అందుకే వీళ్ల వ్యవహారాలు మొత్తం బయటకు తీస్తూ జైల్లో వేస్తున్నారు. దాంతో వైసీపీ లేడీ డాన్లలో వణుకు మొదలైంది. ఇప్పటికే చాలా మందిపై పీడీయాక్ట్ లు కూడా పెడుతున్నారు పోలీసులు.


Full View

Tags:    

Similar News