Ruia Hospital : జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు..!
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు.;
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందిన రోజు.. హైమావతి ప్రత్యక్షసాక్షి.. కరోనా పాజిటివ్ తో రుయా హాస్పిటల్లో చేరిన హైమావతి... ఆ సంఘటనపై జగన్ సర్కార్ ను నిలదీసింది. సీఎం జగన్ రావాలంటూ tv5 తో తన గోడును వెళ్లబోసుకుంది.
టీవీ5తో ఆమె చేసిన వ్యాఖ్యలను అలిపిరి పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీనితో హైమావతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత వదిలేశారు. హైమావతి అరెస్టు చేయడం పట్ల ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్నాయి.. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ కూడా లేదా అని ప్రజలు.. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
కరోనా కేసులు, మరణాలపై ఎవరు మాట్లాడినా, చర్చించినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. హైమావతి అనే మహిళ.. రుయాలో సంఘటన జరిగిన రాత్రి నరకయాతన అనుభవించనని చెప్పడం తప్పైందా అని విమర్శిస్తున్నారు.