సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం జరిగింది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విమానాశ్రయంలో ఉన్నట్టు సచిన్ టెండూల్కర్ తెలుసుకున్నారు. వెంటనే చంద్రబాబును మర్యాదపూర్వకంగా పలకరించి కాసేపు సంభాషించుకున్నారు. 'ఢిల్లీ విమానాశ్రయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాను. ఆయనను కలవటం ఆనందంగా ఉంది' అంటూ వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోను చంద్రబాబు పోస్ట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న సచిన్ టెండూల్కర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే ఆయన వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇద్దరు కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇది పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తోంది. ఎంపీలతో సమావేశం, సచిన్‌తో సంభాషణ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని 1 జన్ పథ్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లారు.