New Chief Secretary of Andhra Pradesh : ఏపీ కొత్త సీఎస్‌గా సాయి ప్రసాద్?

Update: 2024-12-25 09:00 GMT

ఏపీ సీఎస్‌ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త CS ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో ఐఏఎస్ శ్రీలక్ష్మి టాప్‌లో ఉన్నారు. అయితే ఆమెను నియమించడానికి సీఎం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె తర్వాత అనంతరాము ఉన్నప్పటికీ సాయిప్రసాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో చంద్రబాబు పేషీలో కార్యదర్శిగా పనిచేశారు. . ఆ తర్వాత జగన్‌ హయాంలో కూడా సీసీఎల్‌ఏ, రెవెన్యూ స్పెషల్‌ సీఎ్‌సగా రెండు బాధ్యతలూ నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన సాయి ప్రసాద్‌కు చంద్రబాబు కీలక పోస్టు ఇవ్వరని మొదట్లో అనుకున్నప్పటికీ అలా చూసుకుంటూ పోతే ఎవరికీ అవకాశాలు ఇవ్వలేమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

Tags:    

Similar News