Sankranthi Special: ఆన్‌లైన్‌లో కోడిపందేలు.. లక్షల్లో బెట్టింగ్‌లు
Sankranthi Special: ఏపీలో కోడి పందేల నిర్వహణలో నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది.;
Sankranthi Special: ఏపీలో కోడి పందేల నిర్వహణలో నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. పందేలు లైవ్‌లో చూపిస్తూ భారీగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పురుడు పోసుకున్నాయి ఈ ఆన్‌లైన్ పందేలు. ఏడాది పొడవునా పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల కళ్లుగప్పి కోట్లలో పందేలు కాస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి గ్రూప్‌లలో లైవ్‌లో చూపిస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.
అయితే.. ఎక్కడ? ఎప్పుడు? ఎలా జరుగుతాయో? తెలియకుండా కథ నడిపిస్తున్నారు. 500 నుంచి లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, రాజకీయ నాయకులే టార్గెట్. అటు.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. 200 నుంచి 30వేల వరకు కోళ్ల ధరలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే పలు చోట్ల కోడి పందేలు జోరుగా నిర్వహిస్తున్నారు.