SC: సీజేఐపై దాడిని ఖండించిన పవన్
ముక్త కంఠంతో ఖండిస్తున్న ప్రజాస్వామ్యవాదులు
సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది దాడికి యత్నించిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, "హింసకు సనాతన ధర్మంలో చోటు లేదు" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. న్యాయం నిబద్ధతతో సాధించాలి తప్ప, భావోద్వేగంతో కాదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడటంలో జనసేన అండగా ఉంటుందని తెలిపారు.
దేశ సర్వోన్నత న్యాయస్దానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏకంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పైనే దాడికి ఓ లాయర్ విఫలయత్నం చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇలాంటి పరిణామాలు తనపై ప్రభావం చూపలేవని ఈ ఘటన అనంతరం సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల ప్రస్తావన సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాది.. జడ్డీలు కూర్చునే పోడియం వద్దకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పైకి విసిరే ఉద్దేశ్యంతో తన షూను తొలగించేందుకు ప్రయత్నించాడు. కోర్టు గదిలో ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అతన్ని అడ్డుకున్నారు. దీంతో సదరు న్యాయవాదిని ముందుకెళ్లకుండా అడ్డుకుని కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. నిందితుని న్యాయవాది రాకేష్ కిషోర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు ముందు 'సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు' అని లాయర్ కేకలు వేయడం కనిపించింది. అయితే ఇలాంటి వాటికి తాను భయపడేది లేదని ఘటన అనంతరం సీజేఐ అన్నారు. యథాప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగించారు. నిందితుడిని ఢిల్లీ డీసీపీ, సుప్రీంకోర్టు భద్రతా అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.
ఆ వ్యాఖ్యల వల్లేనా...?
హిందూ దేవుళ్లపై సీజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ పాండే తెలిపారు. దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 'దాడి చేసిన వ్యక్తి లాయర్ దుస్తుల్లో, గుర్తింపు కార్డు వేసుకొని ఉన్నారు. చుట్టిన కొన్ని కాగితాలు అతని వద్ద ఉన్నాయి' అని లాయర్ తన్వీర్ ట్వీట్ చేశారు. ఈ గందరగోళం మధ్యే సీజేఐ గవాయ్ ఈ ఘటనపై స్పందించారు. కోర్టు హాల్లో ఉన్న వారు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరారు. ఇవన్నీ చూసి డిస్టర్బ్ కావొద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవన్నారరు.దీంతో కోర్టులో కేసు విచారణ కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే సీజేఐ గవాయ్ ఈ ఘటనపై స్పందించారు. కోర్టు హాల్లో ఉన్న వారు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరారు. ఇవన్నీ చూసి డిస్టర్బ్ కావొద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవన్నారు.