YS Vivekananda Reddy: వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, రంగన్నకు భద్రత పెంపు..
YS Vivekananda Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.;
YS Vivekananda Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి, వాచ్‌మెన్ రంగన్ననకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అటు.. కేసును పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు.. రాంసింగ్, చౌరసియాలు ఢిల్లీకి పయనం అయ్యారు. సోమవారం సీబీఐ ఉన్నతాధికారుల బృందం కడప చేరుకోనుంది.
ఈ కేసులో సీబీఐ అధికారులు మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉంది. కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 41ఏ నోటీసుల అనంతరం మిగతా నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో దస్తగిరి, రంగన్న భద్రతకు సీబీఐ అధికారులు గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.