SHIVAJI: విమర్శల సుడిగుండంలో నటుడు శివాజీ

శివాజీపై కన్నెర్ర చేసిన టాలీవుడ్ ప్రముఖులు.. తనపై కుట్ర జరుగుతోందని శివాజీ ఆవేదన

Update: 2025-12-28 04:30 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి వివాదం చెలరేగింది. నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్న ఆరోపణలతో సోషల్ మీడియా నుంచి రాజకీయ వేదికల వరకు విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, సినీ ప్రముఖులు ఈ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండిస్తున్నారు. సినిమా రంగం సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా ప్రజా వేదికలపై కూడా విస్తృత చర్చకు దారితీసింది.

నాపై కుట్ర జరుగుతోంది: శివాజీ

హీరోయిన్లపై అసభ్య పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. తన సమాధానం చెప్పుకొన్నాడు. ఆ తర్వాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై కుట్ర చేశారన్నాడు. మరోవైపు శివాజీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ‘‘ఇండస్ట్రీలో జరిగిన ఘటన కారణంగానే అలాంటి కామెంట్లు చేశా. అయితే అందులో తప్పుడు పదాలు దొర్లాయి. అది అంగీకరించా. దీనిపై ఇప్పటికే క్షమాపణ చెప్పినట్లు మహిళా కమిషన్ కు తెలియజేశా. ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉంది. అందుకే కుట్ర చేశారు’’ అని శివాజీ అన్నాడు. ఇకపై మహి­ళల వి­ష­యం­లో చు­ల­క­న­గా మా­ట్లా­డ­బో­న­ని కమి­ష­న్ కు శి­వా­జీ తె­లి­పా­రు.

తప్పు ఎవరు చేసినా తప్పే :ప్రకాష్‌రాజ్

ఐబొ­మ్మ రవి ఇష్యూ­పై నడు­టు ప్ర­కా­ష్ రాజ్ స్పం­దిం­చా­రు. దొం­గ­త­నం ఎవరు చే­సి­నా తప్పే కదా అని ప్ర­శ్నిం­చా­రు. సి­ని­మా టి­కె­ట్ ధర ఎక్కువ అని­పి­స్తే సి­ని­మా­లు చూ­డ­క­పో­తే సరి­పో­తుం­ద­న్నా­రు. అం­తే­కా­నీ, దొం­గ­త­నం చేసే వాడు హీరో ఎలా అవు­తా­డ­ని ప్ర­శ్నిం­చా­రు. ఒక పె­ద్ద దొం­గే ఈ దే­శా­ని­కి మహా­ప్ర­భు అయ్యా­డ­ని, అం­ద­రూ దొం­గ­నే.. సమ­ర్థి­స్తే ఎలా అని క్వ­శ్చ­న్ చే­శా­రు. శి­వా­జీ వ్యా­ఖ్య­ల­పై­నా ప్ర­కా­శ్ రాజ్ స్పం­దిం­చా­డు. అన­సూ­య­కు మద్ద­తు­గా ప్ర­కా­శ్ రాజ్ పో­స్ట్ చే­య­గా.. దా­న్ని అన­సూయ రీ పో­స్ట్ చే­సిం­ది.

శివాజీని రేపిస్టుతో పోల్చిన ఆర్జీవీ

దం­డో­రా మూవీ ప్రీ-రి­లీ­జ్ ఈవెం­ట్‌­లో నటు­డు శి­వా­జీ హీ­రో­యి­న్ల డ్రె­స్సిం­గ్ సె­న్స్ గు­రిం­చి చే­సిన వ్యా­ఖ్య­ల­పై RGV ఘా­టు­గా స్పం­దిం­చా­డు. "ఏయ్ శి­వా­జీ.. నీ ఇం­ట్లో­ని మహి­ళ­లు నీ­లాం­టి అనా­గ­రిక, ము­రి­కి మన­స్త­త్వం ఉన్న వా­డి­ని భరిం­చ­డా­ని­కి సి­ద్ధం­గా ఉంటే, వా­రి­కి నీ నీ­తు­లు చె­ప్పు­కో, వా­రి­పై మో­ర­ల్ పో­లీ­సిం­గ్ చే­సు­కో" అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. తా­జా­గా శి­వా­జీ­ని ని­ర్భయ రే­పి­స్ట్‌­తో పో­ల్చు­తూ వీ­డి­యో షేర్ చే­శా­డు. ఈ వీ­డి­యో వై­ర­ల్ అవు­తోం­ది. శివాజీపై ముప్పేటా దాడి జరుగుతోంది.

ఆడపిల్లల జోలికొస్తే చెప్పుతో కొట్టండి: నాగబాబు

మ‌­హి­ళ­‌ల వ‌­స్త్రా­ద­‌­ర­‌­ణ­‌­పై న‌­టు­డు శి­వా­జీ చే­సిన వ్యా­ఖ్య­‌­ల­‌­పై జ‌­న­సేన నేత‌, న‌­టు­డు నా­గ­‌­బా­బు స్పం­దిం­చా­రు. శి­వా­జీ త‌న టా­ర్గె­ట్ కా­ద­‌­ని కానీ మ‌న స‌­మా­జం­లో మో­ర­‌­ల్ పో­లీ­సిం­గ్ అనే సా­మా­జిక రు­గ్మ­‌త ఉం­ద­‌­న్నా­రు. మ‌గ అహం­కా­రం­తో ఉన్న మ‌న సొ­సై­టీ ఆడ­‌­పి­ల్ల­‌­లు ఎలా ఉం­డా­లి, ఏం మా­ట్లా­డా­లి, ఏం మా­ట్లా­డ­‌­కూ­డ­‌­దు అనే వి­ష­‌­యా­లు మా­ట్లా­డు­తు­న్నా­ర­‌­ని అన్నా­రు. ఆడ­‌­పి­ల్ల­‌ల గు­రిం­చి మా­ట్లా­డ­‌­టా­ని­కి మీకు ఏం హ‌­క్కు ఉం­ద­‌­ని ప్ర­‌­శ్నిం­చా­రు. కొం­ద­‌­రు మ‌­హి­ళ­‌­లు కూడా దీ­ని­కి మ‌­ద్ద­‌­తు ఇస్తు­న్నా­ర­‌­ని అది వా­ళ్ల మ‌­న­‌­సు­లో నుం­డి వ‌­చ్చిం­ది కా­ద­‌­న్నా­రు. ప్ర­‌­పం­చం­లో ఫ్యా­ష­‌­న్ మా­రు­తుం­ద­‌­ని వా­ళ్లు ఎలా­గై­నా ఉం­డొ­చ్చ­‌­న్నా­రు. ఆడ­‌­పి­ల్ల కా­బ­‌­ట్టి ఇలా­నే ఉం­డా­ల­ని అను­కో­వ­‌­డం త‌­ప్ప­‌­న్నా­రు. ఒక­‌­ప్పు­డు తాను కూడా ఆడ­‌­పి­ల్ల అంటే ఇలా­నే ఉం­డా­ల­‌­ని అను­కు­నే­వా­డి­న­‌­ని కానీ దాని నుం­డి బ‌­య­‌­ట­‌­కు వ‌­చ్చా­న­‌­ని చె­ప్పా­రు. ప్ర­‌­పం­చ­‌­వ్యా­ప్తం­గా ఆడ­‌­పి­ల్ల­‌­ల­‌­పై జ‌­రు­గు­తు­న్న అత్యా­చా­రా­లు వా­ళ్ల వ‌­స్త్ర­‌­దా­ర­‌ణ వ‌­ల్ల కా­కుం­డా మ‌­గా­వా­రి రా­క్ష­‌­స­‌­త్వం వ‌­ల్ల­‌­నే జ‌­రు­గు­తు­న్నా­య­‌­ని చె­ప్పా­రు.

Tags:    

Similar News