YCP నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి జనసేన నేతలు షాక్ ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ , ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజమండ్రిలో నమోదైన కేసును జనసేన లీగల్ సెల్ యాక్టివ్ చేసింది. పెండింగ్ లో ఉన్న కేసులో పోసానిపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి జనసేన లీగల్ సెల్ కోరింది. 2021 లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపేందుకు గాంధీ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో రోడ్ల గుంతలు పూడ్చి శ్రమదానం చేపట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు... వీర మహిళలపై పోసాని కృష్ణ మురళి అసభ్య పదజాలంతో దూషించారు. అప్పట్లో రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు పై జనసైనికులు న్యాయ పోరాటం చేయడంతో 2022 నవంబర్ లో కేసు నమోదు అయింది. వైసీపీ సోషల్ మీడియాపై కేసుల దండయాత్ర కొత్త మలుపు తిరిగినట్టయింది.