రామతీర్థం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : సోము వీర్రాజు

కేంద్రం జోక్యం అవసరం లేకుండానే ఏపీలో పరిస్థితులను దారికి తెస్తామన్నారు. రామతీర్థం ఆలయానికి వెళ్లనీయకుండా పోలీసులు తమను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు.;

Update: 2021-01-05 12:16 GMT

రామతీర్థం ఘటన హిందువుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్రం జోక్యం అవసరం లేకుండానే ఏపీలో పరిస్థితులను దారికి తెస్తామన్నారు. రామతీర్థం ఆలయానికి వెళ్లనీయకుండా పోలీసులు తమను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన నడుస్తుందని సోము వీర్రాజు అన్నారు. 

Tags:    

Similar News