Sonu Sood: గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్

ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన సూద్ చారిటీ ఫౌండేషన్... అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు;

Update: 2025-02-04 01:30 GMT

కరోనా సమయంలో వేలాది మందికి సాయం చేసి నిజమైన హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆయన 4 అంబులెన్స్‌లను ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని.. ఈ విషయంలో సోనూసూద్‌ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. సోనూసోద్.. సూద్ ఛారిటీ ఫౌండేషన్ తరుపున గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో.. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుని సోనూ సూద్ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకోగా.. భేటీ అనంతరం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సోనూసూద్.

ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి కావడంపై ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు వాళ్లు అత్యంత ఆప్తులు

తెలుగు వాళ్లంటే తనకి అత్యంత ఆప్తులని.. అందులోనూ ఏపీ ప్రజలంటే చాలా ప్రత్యేకం అని సోనూసూద్ అన్నారు. తన భార్య ఆంధ్రా అమ్మాయి అని గుర్తు చేసుకున్నారు. తెలుగువారికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తానని.. ఏపీ తనకి రెండో ఇల్లు అని అన్నారు. ప్రజలకెప్పుడూ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని అన్నారు. అంబులెన్స్ సేవలు ఆంధ్రాలో మొదలుపెట్టి.. దేశం మొత్తం వ్యాప్తి చెందేలా ప్రయత్నిస్తానని సోనూసూద్ అన్నారు . తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సినీనటుడు సోనుసూద్ ను కలిసిన ఎమ్మెల్యే

ప్రముఖ సినీనటుడు సోనుసూద్ ను ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు హైదారాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సోను సూద్ ఎమ్మెల్యే యార్లగడ్డను కలిశారు. ఈ సందర్భంగా సోనుసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే యార్లగడ్డ అభినందించారు. ఇటు సినిమాల్లో రాణిస్తూ అటు సేవా సేవా కార్యక్రమాలు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు.

Tags:    

Similar News