వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిని కల్తీ చేసి ఎంతటి ఘోరం చేశారో అందరికీ తెలిసిందే. కాకపోతే వ్యవస్థలను మేనేజ్ చేసిన వైసీపీ లీడర్లు.. సిట్ నివేదికలో తమ పేరు లేదని కొందరు సంతోషిస్తున్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మందికి సంబంధం ఉంటే అంత మందిని దోషులుగానే పరిగణిస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సిట్ తుది నివేదికలో తప్పించుకున్నా సరే ప్రభుత్వం వేసే కమిటీ నుంచి తప్పించుకోలేదరంటూ ఇప్పటికే కూటమి వార్నింగ్ ఇచ్చింది. ముందే దొరక్కుండా జాగ్రత్త పడ్డామని వైసీపీ లీడర్లు కొందరు తెగ మురిసిపోతున్న టైమ్ లో.. ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తో ఈ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 45 రోజుల్లోగా విచారణ జరిపి ఫైనల్ నివేదికను ఇవ్వాలంటూ ఆదేశించింది ప్రభుత్వం.
దీంతో వైసీపీ లీడర్లలో అప్పుడే టెన్షన్ మొదలైంది. ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. తమ తప్పేం లేదన్నట్టు బిల్డప్ లు ఇస్తున్నారు. దీంతో వైసీపీ లీడర్ల తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏ తప్పు చేయకపోతే అలా భయపడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వైసీపీ లీడర్లు తప్పు చేశారు కాబట్టే అలా భయపడుతున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి త్వరలోనే ఏకసభ్య విచారణ కమిటీ ఇచ్చే నివేదిక మీదనే అందరి దృష్టి ఉంది.