AP: శ్రీశైలానికి భారీగా వరద.. గేట్లు ఎత్తేందుకు సమాయత్తం

జురాల, సుంకేశుల నుంచి భారీగా వరద... రేపు గేట్లు ఎత్తే అవకాశం;

Update: 2024-07-29 01:30 GMT

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో రేపు( మంగళవారం) శ్రీశైల జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ,అధికారులు సుమారు 5 లేదా 6 రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం జూరాల,సుంకేసుల నుండి 4,41,222 క్యూసెక్కులు నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 కాగా ప్రస్తుతం 156.3860 గా ఉంది. మరోపక్క ఇప్పటికే కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు 61,111 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే నేటి రాత్రికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. జూరాల నుంచి దాదాపు 3లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.40లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. జలాశయానికి ప్రస్తుతం అల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరో వైపు తుంగభద్ర, సుంకేశుల జలాశయాలు కూడా నిండిపోవడంతో అటువైపు నుంచి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. మరో 13 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంటుంది.

దీంతో ఎల్లుండి ఉదయం జలాశయం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి చీరే, సారా ,హరతి సమర్పించి అనంతరం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,అధికారులు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయనున్నారని శ్రీశైలం జలాశయ ఎస్సీ శ్రీరామమూర్తి వెల్లడించారు.

Tags:    

Similar News