STAMPADE: "కాశీబుగ్గ" ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Update: 2025-11-03 04:00 GMT

శ్రీ­కా­కు­ళం జి­ల్లా కా­శీ­బు­గ్గ శ్రీ­వేం­క­టే­శ్వ­ర­స్వా­మి వారి ఆల­యం­లో తొ­క్కి­స­లాట జరి­గిన సం­గ­తి తె­లి­సిం­దే. ఈ తొ­క్కి­స­లాట ఘట­న­లో 10 మంది భక్తు­లు మృతి చెం­ద­గా 13 మంది గా­య­ప­డ్డా­రు. వీ­రి­లో ము­గ్గు­రు పరి­స్థి­తి వి­ష­మం­గా ఉంది.ఇక­పో­తే మృ­తు­ల్లో 9 మంది మహి­ళ­లు కాగా 11 ఏళ్ల బా­లు­డు సైతం ఉన్నా­రు.అయి­తే ఈ ప్ర­మా­దం­పై కేసు నమో­దు చే­సిన పో­లీ­సు­లు వి­చా­రణ చే­స్తు­న్నా­రు. అయి­తే ఈ ప్ర­మా­దా­న్ని సీ­రి­య­స్‌­గా తీ­సు­కు­న్న ప్ర­భు­త్వం­ప్ర­మా­దం­పై ము­గ్గు­రు సభ్యుల కమి­టీ­తో వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చిం­ది. దీం­తో శ్రీ­కా­కు­ళం జి­ల్లా కలె­క్ట­ర్‌ స్వ­ప్ని­ల్ ది­న­క­ర్ ము­గ్గు­రు సభ్యు­ల­తో ఒక కమి­టీ­ని ఏర్పా­టు చే­శా­రు. ఈ త్రి­స­భ్య­క­మి­టీ­లో టె­క్క­లి ఆర్డీ­వో కృ­ష్ణ­మూ­ర్తి, శ్రీ­కా­కు­ళం ASP కేవీ రమణ, దే­వా­దా­య­శాఖ సహాయ కమి­ష­న­ర్‌ ప్ర­సా­ద్‌ ఉన్నా­రు.ఈ త్రి­స­భ్య­క­మి­టీ తొ­క్కి­స­లా­ట­కు గల కా­ర­ణా­ల­ను పరి­శీ­లిం­చి ప్ర­భు­త్వా­ని­కి ని­వే­దిక అం­దిం­చ­నుం­ది.

మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

శ్రీ­కా­కు­ళం జి­ల్లా కా­శీ­బు­గ్గ­లో­ని ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట ఘట­న­లో మృ­తి­చెం­దిన వారి కు­టుం­బా­ల­కు ప్ర­భు­త్వం పరి­హా­రం అం­ద­జే­సిం­ది. రూ.15లక్షల చొ­ప్పున పరి­హా­రా­న్ని కేం­ద్ర­మం­త్రి రా­మ్మో­హ­న్‌­నా­యు­డు, రా­ష్ట్ర మం­త్రి అచ్చె­న్నా­యు­డు అం­దిం­చా­రు. అనం­త­రం అచ్చె­న్నా­యు­డు మా­ట్లా­డు­తూ తొ­క్కి­స­లాట ఘటన తీ­వ్రం­గా కలి­చి­వే­సిం­ద­న్నా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు అం­డ­గా ఉం­టా­మ­ని.. ఇలాం­టి ఘట­న­లు పు­న­రా­వృ­తం కా­కుం­డా చర్య­లు చే­ప­డ­తా­మ­ని చె­ప్పా­రు. కా­శీ­బు­గ్గ­లో­ని వేం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆల­యం­లో శని­వా­రం జరి­గిన తొ­క్కి­స­లా­ట­లో తొ­మ్మి­ది మంది మర­ణిం­చ­గా, 25 మంది తీ­వ్రం­గా గా­య­ప­డిన వి­ష­యం తె­లి­సిం­దే. మృ­తు­ల్లో ఎని­మి­ది మంది మహి­ళ­లు, ఓ బా­లు­డు ఉన్నా­రు. కా­ర్తిక ఏకా­ద­శి సం­ద­ర్భం­గా స్వా­మి దర్శ­నా­ని­కి భక్తు­లు పో­టె­త్త­డం­తో ఉదయం నుం­చి ఆలయం కి­ట­కి­ట­లా­డిం­ది. భక్తు­లం­తా ఒకే­సా­రి ఆల­యం­లో­కి ప్ర­వే­శిం­చే క్ర­మం­లో తో­పు­లాట జరి­గి.. అది తొ­క్కి­స­లా­ట­కు దా­రి­తీ­సిం­ది.

Tags:    

Similar News