AP : చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు : మంత్రి అచ్చెన్నాయుడు

Update: 2025-08-13 17:00 GMT

చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువుల్లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన తొలి ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆక్వా కల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని మంత్రి ఆదేశించారు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిని 5 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రొయ్యల రైతులకు సంపూర్ణ సహకారం:

రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రొయ్యల రైతులకు మేలు జరిగేలా సుంకాల భారంపై ముఖ్యమంత్రిని సంప్రదిస్తామని తెలిపారు. సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఆక్వా రంగానికి, రైతుల శ్రేయస్సుకి ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News