AP: ఫోన్ తీసుకున్నారని అధ్యాపకురాలిపైనే దాడి

Update: 2025-04-22 13:00 GMT

కళాశాల క్యాంపస్‌లో కాల్స్‌ మాట్లాడవద్దంటూ సెల్‌ఫోన్‌ తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడి చేయడం తీవ్ర సంచలనంగా మారింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సోమవారం జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విద్యార్థిని ఫోన్‌ మాట్లాడుతుండగా అధ్యాపకురాలు సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థిని ‘రూ.12000 విలువైన నా సెల్ ఫోన్ తీసుకుంటావా’ అంటూ అధ్యాపకురాలిని బండ బూతులు తిట్టింది. అనంతరం చెప్పుతో కొట్టడంతో అక్కడున్న విద్యార్థులు, సిబ్బంది అవాక్కయ్యారు. దీనిపై యాజమాన్యం విచారణ జరుపుతోంది. విద్యార్థిని తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా టీచర్ పైనే దాడి చేయడంపై పలువురు భగ్గుమంటున్నారు. పీటీ టీచర్‌తో పాటు ఇంకో లేడీ వచ్చి విద్యార్థినిని పక్కకు తీసుకువచ్చారు. ఈ గొడవకు లెక్చరర్ ఫోన్ తీసుకోవటం ఓ కారణం అయితే.. ఫోన్లను తీసుకుని అధికంగా ఫైన్లు వేయటం మరో కారణంగా తెలుస్తోంది. ఫోన్ ఇవ్వకపోవటంతో విద్యార్థిని గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News