Tirupati : పద్మావతి ఆసుపత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి

Update: 2025-03-03 10:30 GMT

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిలో 18వ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం దాదాపు 7 గంటల పాటు శ్రమించి వైద్యులు గుండె మార్పిడి చేశారు. వివరాల్లోకెళితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన 20 ఏళ్ల వినాయకుడు (వినయ్) గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత జబ్బుతో ఇబ్బంది. పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలను హాస్పిటల్ కు వచ్చారు. వైద్యులు పరీక్షించి గుండె మార్పిడి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. ఈ మేరకు ఆ యువకుడి వివరాలను జీవన్దాన్ ట్రస్ట్ లో నమోదు చేశారు.

విజయవాడకు చెందిన 32 ఏళ్ల ప్రదీప్ రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ క్యాపిటల్ ఆసుపత్రిలో చేరారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకు వచ్చారు. జీవన్ దాన్ ట్రస్టు వివరాల మేరకు తిరుపతి వైద్యులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో క్యాపిటల్ ఆసుపత్రిలో తొలగించిన ప్రదీప్ గుండెను ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. తిరుపతి కలెక్టర్, ఎస్పీ సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆపరేషన్కు ఏర్పాట్లు చేసుకున్న వైద్యులు వెంటనే గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేపట్టారు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి 20 ఏళ్ల యువకుడైన వినాయకుడుకి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

Tags:    

Similar News