TTD Laddu Controversy : తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు

Update: 2024-10-04 09:25 GMT

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి అందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్‌ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంటూ, సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. కోట్లాది మంది ప్రజల మనోభావాలను నివృత్తి చేసేందుకు, రాష్ట్ర పోలీసు, సీబీఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతినిధులతో కూడిన స్వతంత్ర సిట్‌తో దర్యాప్తు చేయవలసి ఉంటుందని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రఖ్యాతి గాంచిన శ్రీవేంకటేశ్వర ఆలయానికి చెందిన కోట్లాది మంది భక్తుల మనోభావాలను చూరగొనేందుకే ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags:    

Similar News