ఏపీసీఎం చంద్రబాబు విజనరీ నాయకత్వం హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టిందని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. ఎంరికీ తెలియని రోజుల్లోనే ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లు ఇచ్చి, పెట్టుబడులని ఆకర్షించారని చెప్పారు. దావోస్ లాంటి ప్రదేశాల్లో కూడా ఉదయం 7 గంటలకు మొదలు పెట్టి అర్ధరాత్రి వరకు, తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కృషి చేసిన నేత చంద్రబాబు అంటూ సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ కొనియాడారు.
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు. హైదరాబాద్ లో ఐటీ దూసుకపోవడానికి ఆయనే కారణమన్నారు. మానవ వనరుల కోసం ఇంజనీరింగ్ విద్యాసంస్థలు పెట్టిన విజన్ ఆయనదని అన్నారు. ఆ రోజుల్లో ఐటీ అభివృద్ధి కోసం, మాతో ఉదయం 6 గంటల నుంచే చర్చలు మొదలు పెట్టేవారు. అదీ... చంద్రబాబు గారికి ఉన్న ప్యాషన్ అంటూ పొగిడారు.