Chandrababu : అందుకే జగన్ ఫేక్‌ఫెల్లో : చంద్రబాబు

Chandrababu : పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్‌ఫెలో జగన్‌ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు;

Update: 2022-07-29 12:30 GMT

Chandrababu : పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్‌ఫెలో జగన్‌ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. విలీన మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. నెల్లిపాకలోని వరద బాధితుల్ని పరామర్శించారు.

విలీన మండలాల ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే.. 350 కిలోమీటర్ల దూరాన ఉన్న పాడేరు వెళ్లాల్సి వస్తోందని, అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన అసమర్ధ ముఖ్యమంత్రి జగన్‌ అని విమర్శలు గుప్పించారు. జగన్‌ క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించాలంటూ పిలుపునిచ్చారు. విశాఖను హుదుద్‌కు ముందు, తరువాత అన్న రీతిలో అభివృద్ధి చేసినట్టే.. పోలవరం ముంపు మండలాలను తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News