లోకేష్‌పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ధర్నా
తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.;
తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారా లోకే ష్‌పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఎస్సీ సెల్ నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. గతంలో టీడీపీ తెచ్చిన 29 పథకాలను రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇక ఊరుకోమంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.