TDP JanaSena Alliance: బంగారు భవిష్యత్తు కోసమే తెలుగుదేశం, జనసేన పొత్తు

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Update: 2024-02-25 01:45 GMT

రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయని ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాంటించారు. 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించి నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

అభ్యర్ధుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజల మధ్యే ఉండి.... ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారిని అభ్యర్థులుగా ప్రకటించామన్నారు. కోటీ 30 లక్షల మంది ప్రజల అభిప్రాయాల సేకరించిన తర్వాతే... అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైన రోజునే వైకాపా ఓడిపోతుందని జగన్‌కి అర్థమైందని చంద్రబాబు వివరించారు.

సంఖ్య తక్కువైనా  ఎక్కువ శాతం గెలుపొందే స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 3 పార్లమెంట్ స్థానాల పరిధిని కూడా చూసుకుంటే  జనసేన 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లేనని తెలిపారు. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే  త్యాగాలు చేసినవారికి తగిన ప్రతిఫలం ఉంటుందన్నారు పవన్ కల్యాణ్. 

Tags:    

Similar News