టీడీపీ నేత కళా వెంకటరావు హౌజ్ అరెస్ట్!
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు వెళ్లిన సీనియర్ నేత కళా వెంకట్‌రావును పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.;
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు వెళ్లిన సీనియర్ నేత కళా వెంకట్‌రావును పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజాంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.. హౌజ్ అరెస్టుకు సంబంధించిన నోటీసులు అందించారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని చెప్పారు. పోలీసుల వైఖరిపై కళా వెంకట్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అచ్చెన్నాయుడు అరెస్టు చేశారు. ఆయన్ను కోట బొమ్మాలి పీఎస్‌కు తరలించారు.