శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల చొక్కాలు విప్పించి దాడికి పాల్పడటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని లోకేశ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.