పొంతనలేని లెక్కలు.. రైతుల నోట్లో మట్టికొట్టిన జగన్ : పట్టాభి
రైతు భరోసా పథకాన్ని రైతు దగా పథకంగా మార్చి.. సీఎం జగన్ జాదూ చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన.. తమ ప్రభుత్వం 64.06 లక్షల మందికి..;
రైతు భరోసా పథకాన్ని రైతు దగా పథకంగా మార్చి.. సీఎం జగన్ జాదూ చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన.. తమ ప్రభుత్వం 64.06 లక్షల మందికి రైతుభరోసా అమలుచేస్తుందని చెప్పారని.. 2019 అక్టోబర్ నాటి ప్రభుత్వ ప్రకటనలో ఆ సంఖ్య 54 లక్షలయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లో మాత్రం పీఎం కిసాన్ యోజన పథకంతో అనుసంధానమైన రైతుభరోసా లబ్ధిదారుల సంఖ్య 38లక్షల 45వేల 945 అని ఉందని తెలిపారు. 64 లక్షల మంది రైతులు ఉన్నట్టుండి, కేంద్రం లెక్కలప్రకారం 38 లక్షలకు ఎలా వచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. పొంతనలేని లెక్కలతో, పచ్చి మోసపూరిత పథకమైన రైతుభరోసా పేరుతో జగన్ రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు.