TDP Leader : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎదురించిన టీడీపీ నేత గుండెపోటుతో మరణం
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయిగేటుకు చెందిన టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణ ఆగడాలను శేషగిరి రావు ధైర్యంగా అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు సైతం ఆయన్ని అభినందించారు. మూడు రోజుల క్రితం శేషగిరిరావు భార్య కృష్ణవేణి హైదరాబాద్ వెళ్లగా.. కొడుకు, కూతురు స్టడీ కోసం గుంటూరు, హైదరాబాద్‌లలో ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శేషగిరిరావు ఆదివారం ఇంటిముందు పడిపోయి కనిపించాడు. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి.. శేషగిరిరావు మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.