ఒక్కో వృద్ధుడికి రూ.45 వేలు నష్టం : ఎమ్మెల్యే రామానాయుడు
ప.గో జిల్లా యలమంచిలి తహసీల్దార్ ఆఫీసు ముందు టీడీపీ ధర్నా నిర్వహించింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో..;
ప.గో జిల్లా యలమంచిలి తహసీల్దార్ ఆఫీసు ముందు టీడీపీ ధర్నా నిర్వహించింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వృద్ధులకు 3వేల రూపాయల పింఛన్ ఇస్తామని జగన్ మాట తప్పారని విమర్శించారు. హామీ అమలు చేయకపోవడం వల్ల ఒక్కో వృద్ధుడికి 45 వేల రూపాయలు నష్టం వాటిల్లుతోందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్ని మోసం చేయడం సరికాదని రామానాయుడు విమర్శించారు.