TDP Twitter Hacked : టీడీపీ ట్విట్టర్ అధికారిక ఖాతా హ్యాక్..
TDP Twitter Hacked : టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి హ్యాక్ అయింది;
TDP Twitter Hacked : టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి హ్యాక్ అయింది. పార్టీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారికి హఠాత్తుగా మధ్యాహ్నం తర్వాత ట్విట్టర్ ఖాతా కనిపించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌కు @jaitdp పేరుతో ఖాతా ఉండగా, దాని స్థానంలో టైలర్ హెబ్స్ పేరు ప్రత్యక్షమయింది. టీడీపీ ఖాతాను హ్యాక్ చేసి ట్విట్టర్ హ్యాండిల్‌కు తన పేరు పెట్టుకున్నారు.
తాను ఆర్టిస్టునని బయోలో ప్రకటించుకున్న టైలర్ హబ్స్.. అన్నీ ఆర్టులే పోస్ట్ చేశాడు. వరుసగా ట్వీట్‌లు, రీట్వీట్లు చేసుకుంటూ పోయారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ టీడీపీ ట్విట్టర్ ఖాతాలో ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించిన కల్యాణమస్తు పథకంపై ట్వీట్ చేశారు.
ఆ తర్వాత ఖాతా టైలర్ హెబ్స్ చేతికి వెళ్లింది. గతంలోనూ ఓ సారి టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. రెండు రోజుల పాటు శ్రమించి ఖాతాను మళ్లీ పునరుద్ధరించుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. ట్విట్టర్ హ్యాండిల్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు టీడీపీ సోషల్ మీడియా ఖాతాలు చూసే నిపుణులు ప్రయత్నిస్తున్నారు.