Mock Assembly :మాక్ అసెంబ్లీ సమయం పై టీడీపీ క్లారిటీ..!
Mock Assembly : రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారభం అవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.;
Mock Assembly : రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారభం అవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం ఒక్కరోజు సభ పెట్టడాన్ని నరసిస్తూ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి మాక్ అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా రేపు, ఎల్లుండి వర్చువల్ పద్ధతిలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుంది. రేపు సాయింత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అలాగే ఎల్లుండి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది.