Telangana: తెలంగాణ అసెంబ్లీ 20వతేదీకి వాయిదా..
సభలో వాడీవేడిగా సాగిన వాదనలు;
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి..ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను... గడ్డం వివేక్ వెంకటస్వామి బలపర్చారు. అనంతరం మాట్లాడిన భారాస ఎమ్మెల్యే KTR... గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా సత్య దూరంగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం అప్పులనే చెబుతున్నారన్న KTR నాటి ప్రభుత్వం సృష్టించిన ఆస్తులను ప్రస్తావించడం లేదన్నారు. అప్పుల పేరు చెప్పి.. హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే......... వదిలిపెట్టబోమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వివరించిన గవర్నర్ ఎప్పటినుంచి అమలుచేస్తారో చెప్పకపోవడం దారుణమని భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మైనార్టీల అభివృద్ధికి..... కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామన్న మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ పరీక్షలను ఉర్దూలో కూడా పెట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండ్రోజుల్లోనే..... రెండు హామీలు అమలు చేసిందన్న CPI MLA కూనంనేని సాంబశివరావు... హామీలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. అనంతరం.... చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లోనే ప్రధాన ప్రతిపక్షం నిలదీసినట్టు మాట్లాడటం... తగదని సూచించారు. భిన్నరంగాల్లో..... తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ భారాస నేతలు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని వివరించారు.
వ్యవసాయానికి 24గంటలు కరెంటు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్.. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న గత ప్రభుత్వమాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. భారాసప్రభుత్వ హయాంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను సమర్థంగా నిర్వహించలేదని విమర్శించిన ముఖ్యమంత్రి TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని సీఎం స్పష్టంచేశారు.
తెలంగాణలో డ్రగ్స్‌కు చోటులేదని, డ్రగ్స్ కేసుల్లో దోషులు ఎంతటివారైనప్పటికీ ఉపేక్షించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. తర్వాత.... గవర్నర్ ప్రసంగానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను ఈనెల 20కి వాయిదావేశారు.