AP: చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయ్
ఏపీ నేతలు పెద్ద పెద్ద ప్రణాళికతో దావోస్ వచ్చారు... తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు;
ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని కొనియాడారు. వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపీకి మంచి పరిశ్రమలు వస్తాయని, శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అన్నారు. చంద్రబాబు చాలా పెద్ద ప్రణాళికలతో దావోస్ వచ్చారని శ్రీధర్ బాబు వెల్లడించారు. చంద్రబాబు విశాల దృక్పథంతో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అపార వనరులు ఉన్నాయని.. విస్తారమైన సముద్రతీర ప్రాంతం ఉండడంతో అక్కడ మంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఏపీ నేతలు వ్యూహాత్మకంగా ఉన్నారని తనకు అర్థమైందని శ్రీధర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు అల్టిమేట్ అని తెలిపారు. ఆయన మాటలు చాలా పెద్దరికంగా ఉన్నాయన్నారు.
చంద్రబాబు చాలా స్ట్రాంగ్
చంద్రబాబు శారీరంకగా చాలా దృఢంగా ఉన్నారని, దావోస్‌లో మైనస్ 11 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో తామంతా స్వెటర్లు వేసుకుంటే, చంద్రబాబు మాత్రం సాధారణ డ్రెస్‌లోనే ఉన్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో కంపెనీలు ఏపీకి తీసుకెళ్లి, ఇక్కడ ఆటంకాలు సృష్టించే ఆలోచన చంద్రబాబుకు ఏ మాత్రం లేదన్నారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని తెలిపారు.
మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కృషి చేసిన వారికి తగ్గిన గుర్తింపు ఇచ్చేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయగా.. తాజాగా మిగిలిన పోస్టులను భర్తీ చేసే దిశగా చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.