Andhra Pradesh : ఆలయాల చుట్టూ వైసిపి తప్పుడు ప్రచారాలు.. కూటమి చెక్..

Update: 2026-02-16 08:15 GMT

ఏపీలో వైసిపి బ్యాచ్ ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దానిపై తప్పుడు ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా హిందూ ఆలయాలను పట్టించుకున్న పాపాన పోలేదు. రాముడి విగ్రహం తలను నరికినా స్పందించలేదు. ఎన్నో ఆలయాల మీద దాడులు జరిగితే మౌనంగా ఉన్నారు వైసీపీ నేతలు. ఏకంగా తిరుమల క్షేత్రంలో లడ్డూను కల్తీ చేసి.. శ్రీవారి ఆలయం ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు. కోట్లాదిమంది హిందువుల నమ్మకాన్ని తీయాలని చూసారు. ఇన్ని మహాఘోరాలు చేసిన వాళ్లు.. ఇప్పుడు హిందూ ఆలయాల మీద ఎక్కడలేని ప్రేమను వలకబోస్తున్నారు.

మొన్న శ్రీశైలం ఆలయంలో ఒక చిన్న ఘటన జరిగితే.. దాన్ని పట్టుకొని వైసీపీ బ్యాచ్ ఎంత తప్పుడు ప్రచారాలు చేసిందో చూశాం. ఏకంగా ఆలయాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అన్న రేంజ్ లో వైసీపీ సోషల్ మీడియాలో కథనాలు రాయించారు. కానీ నిన్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేసిందో చూశాం. కేవలం 20 నిమిషాల్లోనే దేవుడి దర్శనం అయిపోయేలా చక్కటి ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఆలయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. శ్రీశైలంతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం.

వైసీపీలాగా వీఐపీల దర్శనాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోంది. తిరుమల క్షేత్రంలో మొదలైన ఈ పరంపర.. ఏపీలోని అన్ని ఆలయాల్లో కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏ చిన్న అవాంతరాలు జరగకుండా పోలీసు బందోబస్తు దగ్గర నుంచి.. పరిశుభ్రత, ప్రశాంతమైన దర్శనాల కోసం ఏర్పాట్లు.. ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూలైన్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం.. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు లాంటివి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Tags:    

Similar News