ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తిరుమలలో సందడి చేశారు. గాయకుడు కార్తిక్ తో కలిసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇద్దరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి వెంకన్న దర్శనం చేయించారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. రేపు తిరుపతి లో యస్వీ గ్రౌండ్ లో కార్తిక్ లైవ్ సింగిగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి మొదటి సారి తిరుపతిలో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నారు.