ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్ నిర్మాణం, పేదల సంక్షేమమే లక్ష్యంగా.. వివిధ రంగాలకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది. ఇది స్వల్ప కాలిక బడ్జెట్. మొత్తం 2.94 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 43 వేల 402 కోట్ల వ్యవసాయ రంగానికి కేటాయించారు. 4 వేల 376 కోట్లు సంక్షేమానికి కేటాయించారు. దీపం పథకానికి 895 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు.