TIRUMALA: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

రేపు శ్రీవారి ఆలయం మూసివేత

Update: 2026-03-02 04:15 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం 83,112 మంది శ్రీవారిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

రేపు శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం మూసివేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. చంద్రగ్రహణం కారణంగా బుధవారం దాదాపు 10.30 గంటల పాటు ఆలయం మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ ఉండనుండటంతో.. రేపు ఉదయం 9 గంటలకు అర్చకులు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. ఈ క్రమంలో అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేయనున్నారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించి.. ఆ తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సమయంలో భక్తులు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు ముందే సమాచారం అందించారు. గ్రహణ సమయాల్లో ఆలయాలను మూసివేసి సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరవడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రంలోని దర్శన వేళల్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఇక గ్రహణం కారణంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ఆలయాల మూసివేత సమయాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రహణ కాలంలో ఆహార పానీయాలు తీసుకోకపోవడం, దైవ నామస్మరణ చేయడం వంటి నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

మరోవైపు, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్స్ అన్ని నిండిపోయి.. వెలుపల క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 83 వేల 122 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 54 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. 4.49 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.

Tags:    

Similar News