TIRUPATHI: ఇక "గ్రేటర్" తిరుపతి

గ్రేటర్‌గా మారనున్న పవిత్ర నగరం తిరుపతి... గ్రేటర్‌ తిరుపతికి నగరపాలక సంస్థ ఆమోదం

Update: 2025-10-26 06:30 GMT

తి­రు­ప­తి పేరు వి­న­గా­నే గు­ర్తొ­చ్చే­ది శ్రీ వెం­క­టే­శు­డే. గో­విం­దు­ని నామ స్మ­ర­ణ­తో తి­రు­ప­తి­లో­ని తి­రు­మల కొం­డ­లు అను­ని­త్యం మా­రు­మ్రో­గి­పో­తుం­టా­యి. స్వా­మి వా­రి­ని దర్శిం­చు­కు­నేం­దు­కు భక్తు­లు తం­డో­ప­తం­డా­లు­గా తర­లి­వ­స్తుం­టా­రు. ని­త్యం లక్ష­లా­ది మంది తి­రు­ప­తి నుం­చి రా­క­పో­క­లు సా­గి­స్తుం­టా­రు. తి­రు­మ­ల­తో పాటు తి­రు­ప­తి­లో బస చే­స్తా­రు. కే­వ­లం తి­రు­మ­లే­శు­డి­నే కా­కుం­డా చు­ట్టూ ఉన్న ప్ర­ముఖ దే­వా­ల­యా­ల­ను కూడా సం­ద­ర్శి­స్తా­రు. ఇలా ఆధ్యా­త్మి­కం­గా, చా­రి­త్రా­త్మ­కం­గా, పర్యా­ట­కం­గా ఎంతో ప్రా­శ­స్త్యం పొం­దిన తి­రు­ప­తి నగరం మరింత వి­స్త­రిం­చ­నుం­ది. అం­దు­కు సం­బం­ధిం­చిన ప్ర­తి­పా­ద­న­ల­ను తి­రు­ప­తి నగ­ర­పా­లక సం­స్థ పాలక మం­డ­లి ఆమో­దిం­చిం­ది. దీం­తో ప్ర­స్తు­తం 30.17 చద­ర­పు కిలో మీ­ట­ర్లు ఉన్న తి­రు­ప­తి నగరం కా­స్త సు­మా­రు 300ల చద­ర­పు కిలో మీ­ట­ర్ల­కు వి­స్త­రిం­చ­నుం­ది. సీఎం చం­ద్ర­బా­బు తి­రు­ప­తి నగర అభి­వృ­ద్ధి­పై తొలి నుం­చీ శ్ర­ద్ధా­స­క్తు­లు చూ­పు­తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. అం­దు­లో భా­గం­గా­నే ఈ ఏడా­ది ప్రా­రం­భం­లో నా­రా­వా­రి­ప­ల్లి­కి వచ్చిన సం­ద­ర్భం­లో జి­ల్లా అభి­వృ­ద్ధి­పై కలె­క్ట­ర్‌­కు పలు సూ­చ­న­లు, ఆదే­శా­లు జారీ చే­శా­రు. అం­దు­లో గ్రే­ట­ర్‌ తి­రు­ప­తి ఒకటి. అప్ప­ట్నుం­చి జి­ల్లా యం­త్రాం­గం దీ­ని­పై కస­ర­త్తు ప్రా­రం­భిం­చిం­ది. భౌ­గో­ళి­కం­గా ప్ర­జ­ల­కు గానీ, అధి­కార యం­త్రాం­గా­ని­కి గానీ అసౌ­క­ర్యం కల­గ­ని రీ­తి­లో తి­రు­ప­తి రూ­ర­ల్‌, చం­ద్ర­గి­రి, రే­ణి­గుంట, ఏర్పే­డు మం­డ­లాల పరి­ధి­లో­ని 53 పం­చా­య­తీ­ల­కు సం­బం­ధిం­చిన 63 రె­వె­న్యూ గ్రా­మా­ల­ను గ్రే­ట­ర్‌ తి­రు­ప­తి­లో వి­లీ­నం చే­సేం­దు­కు ప్ర­తి­పా­ద­న­లు సి­ద్ధం చే­శా­రు.

మారనున్న తిరుపతి రూపురేఖలు

గ్రే­ట­ర్‌­గా మా­రి­తే తి­రు­ప­తి నగర రూ­పు­రే­ఖ­లు అనూ­హ్యం­గా మా­రి­పో­ను­న్నా­యి. ఇపు­డు కే­వ­లం 30 చద­ర­పు కి­లో­మీ­ట­ర్ల వై­శా­ల్యం కలి­గిన తి­రు­ప­తి.. 284 చద­ర­పు కి­లో­మీ­ట­ర్ల­కు వి­స్త­రిం­చ­నుం­ది. 4.50 లక్షల జనా­భా 7.50 లక్ష­ల­కు పె­ర­గ­నుం­ది. రూ.149 కో­ట్లు­గా ఉన్న వా­ర్షి­కా­దా­యం రూ.182 కో­ట్ల­కు చే­ర­నుం­ది. చం­ద్ర­గి­రి, రే­ణి­గుంట వంటి మే­జ­ర్‌ పం­చా­య­తీ కేం­ద్రా­లు తి­రు­ప­తి­లో అం­త­ర్భా­గం కా­వ­డం­తో పాటు వి­మా­నా­శ్ర­యం వె­లు­ప­లు­న్న వి­కృ­త­మాల దాకా నగరం వి­స్త­రిం­చ­నుం­ది. చం­ద్ర­గి­రి, తి­రు­ప­తి రూ­ర­ల్‌ మం­డ­లా­ల­కు చెం­దిన పం­చా­య­తీ­లు తి­రు­ప­తి కా­ర్పొ­రే­ష­న్‌­లో వి­లీ­నం కా­వ­డం పట్ల ఎమ్మె­ల్యే పు­లి­వ­ర్తి నా­నీ­కి అభ్యం­త­ర­మే­మీ లే­ద­ని సమా­చా­రం. తి­రు­ప­తి అభి­వృ­ద్ధి పట్ల ఆయ­న­కూ ఆస­క్తి ఉం­ద­ని సన్ని­హి­తు­లు చె­బు­తు­న్నా­రు. అయి­తే రా­జ­కీయ కోణం నుం­చి చూ­సి­న­ప్పు­డు పం­చా­య­తీల వి­లీ­నం కా­ర­ణం­గా ఆయ­న­పై స్థా­నిక నేతల నుం­చీ తీ­వ్ర ఒత్తి­డి ఎదరు కా­నుం­ది. పం­చా­య­తీ ఎన్ని­క­లు సమీ­పి­స్తు­న్న వేళ సర్పం­చు పద­వు­ల­పై ఆశలు పె­ట్టు­కు­న్న నే­త­లు తా­జా­గా గ్రే­ట­ర్‌ ప్ర­తి­పా­ద­న­లు రా­వ­డం­తో ని­స్పృహ చెం­దు­తు­న్న­ట్టు చె­బు­తు­న్నా­రు. ఈ కా­ర­ణం­గా­నే చం­ద్ర­గి­రి ని­యో­జ­క­వ­ర్గం­లో­ని పం­చా­య­తీల వి­లీ­నం పట్ల ఎమ్మె­ల్యే నానీ కొంత అయి­ష్టం­గా ఉన్న­ట్లు సమా­చా­రం. అయి­తే చం­ద్ర­బా­బు ఆదే­శాల నే­ప­థ్యం­లో పా­ర్టీ నేతల సమా­ధా­న­ప­డే అవ­కా­శం ఉంది.

Tags:    

Similar News