Selfies : సెల్ఫీల కోసం వాగుల్లోకి.. ఓవరాక్షన్ చేయొద్దంటున్న అధికారులు

Update: 2024-09-12 16:30 GMT

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు..సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏజెన్సీలో సెల్ఫీల కోసం వరదల్లోకి వెళ్తున్నారు పర్యాటకులు.

వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వాగు మధ్య బండ రాళ్ల వద్దకు వెళ్తున్నారు.

అయితే ఇదే వాగులో ఇప్పటికే పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నప్పటికీ.. పోలీస్, రెవిన్యూ అధికారులు లేకపోవడంతో వాగు మధ్యకు వెళుతున్నారు పర్యాటకులు. వాగు దగ్గర అధికారులు లేకపోవడంతో విచ్చలవిడిగా వాగులోకి దిగుతున్నారు పర్యాటకులు.

Tags:    

Similar News