తిరుమలకు వెళ్లే అన్ని రకాల వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది. అలిపిరి వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్‌ను అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించారు. అర్హత కలిగిన వినియోగదారులు ఒకేసారి రూ.3 వేల రుసుము చెల్లించి 200 టోల్-ఫ్రీ ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపలే 200 ట్రిప్పులు పూర్తయితే అంతటితో పాస్ చెల్లుబాటు ముగుస్తుంది. పాస్ పరిమితి అయిపోయిన తర్వాత ఫాస్టాగ్ ఎప్పటిలాగే సాధారణ పే ఫర్ యూజ్ సిస్టమ్‌కు తిరిగి వస్తుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వాణిజ్య లేదా గూడ్స్ వాహనాల కోసం కాదు. ఫాస్టాగ్ పాస్ అర్హత కోసం వాహనంలో యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాల్ చేయబడి ఉండాలి. ఫాస్టాగ్ ను కేవలం ఛాసిస్ నంబర్‌తో కాకుండా పూర్తి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)కి లింక్ చేయాలి. ఫాస్టాగ్ ను బ్లాక్‌లిస్ట్ చేయకూడదు, దానికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండకూడదు. తాత్కాలిక నంబర్లు ఉన్న వినియోగదారులు దరఖాస్తు చేసుకునే ముందు వారి ఫాస్ట్‌ట్యాగ్ వివరాలను అపడేట్ చేయాలి. NHAI నేరుగా నిర్వహించే టోల్ ప్లాజాలలో మాత్రమే పాస్ చెల్లుతుంది. రాష్ట్ర రహదారులు, ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రోడ్లు, రాష్ట్ర నిర్వహణ ఎక్స్‌ప్రెస్ వేలలో ఈ పాస్ చెల్లదు.