TTD : ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటలలోపు భక్తులకు దర్శనం

Update: 2025-08-03 09:08 GMT

తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూకాంప్లెక్సు లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టి లో పెట్టుకొని ఉచితంగా గూగుల్ / టిసిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాత ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలక మండలి ముందుకు వెళ్ళుచున్న సమయంలో

విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి టిటిడి లో ఈఓగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం భాధాకరం..

శ్రీవారిని‌ క్షణ కాలం పాటు దర్శించుకునేందుకు సామాన్యభక్తులు ఎదుర్కుంటున్న జాప్యాన్ని, ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా సాధ్యమైనంత త్వరితగతిన భక్తులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకునేలా ...ఏఐ సాంకేతికత సహకారం అందించేందుకు గూగుల్ /టిసిఎస్ తదితర ప్రముఖ సంస్థలు పనిచేస్తున్న తరుణంలో.....భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా, ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న మీరు ...తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.

టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృధా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్

భక్తులను గంటలు, రోజులు తరబడి షెడ్లలో, కంపార్టమెంట్లలో బంధించి భక్తులు పడిగాపులు కాయడం మంచిదా...? భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ ను తీసుకురావాలని నిర్ణయించాము. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్న తరుణంలో టీటీడీ కూడా ఏఐ టెక్నాలజీ వాడడంలో ఎలాంటి తప్పు లేదు

ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. పూర్తిగా ఖండిస్తున్నా

—బీ. ఆర్.నాయుడు

చైర్మన్ టీటీడీ

Similar News