Visakhapatnam: ఒక బాయ్‌ఫ్రెండ్.. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్.. కట్ చేస్తే కథలో ట్విస్ట్..
Visakhapatnam: మామూలుగా ఇద్దరు అబ్బాయిలు.. ఒక అమ్మాయి కోసం గొడవపడడం చూస్తూనే ఉంటాం.;
Visakhapatnam: మామూలుగా ఇద్దరు అబ్బాయిలు.. ఒక అమ్మాయి కోసం గొడవపడడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? అలాంటి ఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తాయి. అలాంటి ఘటనే విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.
బాయ్‌ఫ్రెండ్ కోసం విశాఖ జిల్లా అనకాపల్లి బస్టాండ్ వద్ద ఇద్దరు కాలేజ్ విద్యార్థినులు హల్‌చల్ చేశారు. ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు.. తన బాయ్‌ఫ్రెండ్ విషయంలో మాటకుమాట పెరిగి అందరూ చూస్తుండగానే జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. కాలేజీలకు చదువుకుందుకు వెళ్తున్నారా.. లేక ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడపడానికి వెళ్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.