Nandyal : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. ఆరుగురికి అస్వస్థత

Update: 2025-02-28 08:30 GMT

నంద్యాల జిల్లా ఆత్మకూరులోని నీలితొట్ల వీధిలో కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోవడం కలకలం రేపింది. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీరు ఎలా కలుషితం అయ్యిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంచి నీళ్ల సరఫరా నిలిపివేశారు. స్థానికుల నుంచి నీటిని సేకరించి ల్యాబ్‌కు తరలించినట్లు సమాచారం. నీళ్లు కలుషితం ఎలా అయ్యాయనే దానిపై విచారణ మొదలు పెట్టారు. నీలితొట్లకు రోజు మాదిరిగానే వచ్చిన కుళాయి నీళ్లనే తాగారా..? లేదా మరేచోట నుంచి తెచ్చుకున్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News