YSRCP Leader : వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు ఊహించని షాక్..

Update: 2024-08-17 06:30 GMT

దుబాయ్ వెళ్లేందుకు వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రయత్నించగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. అవినాష్ టూర్ పై మంగళగిరి రూరల్ పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని తెలిపారు. ఆయనను ప్రయాణించేందుకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అనుమతి ఇవ్వలేదు.

చేసేది ఏమి లేక అక్కడి నుంచి అవినాష్ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో అవినాష్పై కేసు నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.

Tags:    

Similar News