టీటీడీ పాలకమండలి నియామకంపై దుమారం... సీఎం జగన్‌కు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కొత్తగా పాలకమండలి సభ్యులపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్‌కు చెందినవారికి చోటు కల్పించారు.;
టీటీడీలో కొత్తగా నియమితులై ప్రత్యేక ఆహ్వానితులపై దుమారం రేగుతోంది. కొత్తగా పాలకమండలి సభ్యులపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్‌కు చెందినవారికి చోటు కల్పించారు. టీడీపీ ప్రత్యేక ఆహ్వానితుల్లో...ఒకరు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి సిఫార్సులో నియామకం జరిగినట్లు వార్త...తీవ్ర చర్చకు దారితీసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా రవిప్రసాద్ నియాకంలో... తన ప్రమేయం ఉన్నట్లు వార్తలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు దుర్వినియోగం చేయటంపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కేంద్ర పర్యాటకశాఖ సిఫార్సుతో ప్రత్యేక ఆహ్వానితునిగా నియామకం జరిగిన విషయంపై..విచారణ చేపట్టాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు కిషన్‌రెడ్డి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం జగన్‌ను కోరారు..