AP: పొందూరుకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.;
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళ్లనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. అక్కడ జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖ జిల్లా కేడి పేట వెళ్తారు. నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం, విశాఖలో పర్యటిస్తుండడంతో ఆమెకు వినతిపత్రం ఇచ్చేందుకు సీఐటీయూ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానే ఉంచాలని విజ్ఞప్తి చేయనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో.. సంస్థను ప్రైవేటీకరించొద్దంటున్నారు సీఐటీయూ నేతలు, కార్మికులు. అయితే, నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయల్దేరిన సీఐటీయూ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ సీఐటీయూ నాయకుల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరావును ఉదయం 5గంటలకు హౌస్ అరెస్టు చేశారు.