కృష్ణా జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించారు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. బుడమేరు పొంగి గన్నవరం మండలం కేసరపల్లి వద్ద పంట పొలాలు ముంపునకు గురైన పంట పొలాలను శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు.
రైతులతో అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండు రోజుల నుంచి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించానని... ముంపునకు గురైన ప్రతి పంటకు నష్టపరిహారం అందేలా చూసి రైతన్నను ఆదుకుంటామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్... కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.